నాలుగు చినుకులు పడితే మనకూ వస్తుందీ ఐడియా!

Full Body Ambilla in japan - Sakshi

అవసరాలు.. మనిషి చేత అద్భుతాలను సృష్టిస్తాయి. ఆ అద్భుతాలు.. అప్పుడప్పుడూ యావత్‌ ప్రపంచాన్ని ముచ్చటపడేలా చేస్తాయి. అందుకు ఉదాహరణే ఈ గొడుగు. ఒకప్పుడు గొడుగులంటే.. ఒక్కటే కలర్‌లో తాటాకంత పెద్దగా, వృద్ధుల చేతిలోని కర్రలా పొడవుగా ఉండేవి. కాలక్రమేణా సింపుల్‌గా, స్లిమ్‌గా బ్యాగ్‌లో సైతం పట్టేంత చిన్నగా మారి, రెయిన్‌బో కలర్స్‌ని సైతం మరిపించసాగాయి.

ఇక వేసవి కాలంలో ఎండ తగలకుండా వేసుకునే గొడుగుకి.. ఫ్యాన్స్‌ అమర్చిన గొడుగులు మార్కెట్‌ లోకాన్ని బాగానే ఏలుతున్నాయి. అయితే జపాన్‌లో కనిపిస్తున్న ఈ సరికొత్త ‘ఫుల్‌ బాడీ అంబ్రిల్లా’లు మాత్రం చూపరుల చేత ‘వాట్‌ యాన్‌ ఐడియా సర్జీ’ అనిపిస్తున్నాయి. ఈ గొడుగు ప్రత్యేకత ఏంటంటే... కుండపోత వర్షం వస్తున్నా, తల నుంచి కాళ్ల దాకా తడవకుండా వెళ్లాల్సిన చోటికి వెళ్లిపోవచ్చు. గొడుగు మొత్తం ఓపెన్‌ చేసుకుని, పొడవాటి కవర్‌ని గొడుగుకి తొడుక్కుంటే చాలు చక్కగా అందులో ఉన్నవారిని తడవకుండా చేస్తుంది.

ఈ గొడుగు మనిషిని మొత్తం కప్పేసినా, ఇందులోంచి చూస్తే చుట్టు పక్కలంతా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఐడియా ఏదో బాగుంది కదూ!? ఆసక్తి ఉంటే ఇలాంటి గొడుగును స్వయంగా తయారు చేసుకోవచ్చు. కాకపోతే అంత పొడవు కవర్‌ దొరకడం కష్టం కాబట్టి అతుకులు, ప్లాస్టర్‌ అంటింపులు తప్పవు. సరదాగా ప్రయత్నించండి మరి. ఈ వర్షాకాలంలో తడుస్తూ పోతున్నవారిని అవాక్కు పరచండి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top