రారండోయ్‌ | Events in Hyderabad | Sakshi
Sakshi News home page

రారండోయ్‌

Apr 16 2018 1:14 AM | Updated on Sep 4 2018 5:07 PM

నిజం కవితా సంపుటి ‘నివురు’ ఆవిష్కరణ ఏప్రిల్‌ 18న ఉదయం 10:30కు హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరగనుంది. వక్తలు: పి.అంజయ్య, కె.శివారెడ్డి, కె.శ్రీనివాస్, దేవిప్రియ, ఎన్‌.వేణుగోపాల్‌.
కవిరాజ్‌ స్వర్ణోత్సవ(1968–2018) కవి సమ్మేళనం ఏప్రిల్‌ 21న సాయంత్రం 5 గంటలకు సాయి బృందావన్‌ ఫంక్షన్‌ హాలు, సూర్యాపేటలో జరగనుంది. ఇందులోనే కవిరాజ్‌ సాహితీ పురస్కారాన్ని జూలూరి గౌరీశంకర్‌కు ప్రదానం చేస్తారు. జి.జగదీశ్‌ రెడ్డి, వేణు ఊడుగుల అతిథులు.
జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు శతకం ‘కోనసీమ శతకం’ ఆవిష్కరణ ఏప్రిల్‌ 21న సాయంత్రం 5:30కు అమలాపురంలోని ఎస్‌.కె.బి.ఆర్‌. కళాశాల ప్రాంగణంలో జరగనుంది. నిర్వహణ: త్రివేణి నృత్య గీత సాహిత్య కళావేదిక, అమలాపురం.


శ్రీరామకవచం సాగర్‌ రచన ‘యాతన’ ఆవిష్కరణ ఏప్రిల్‌ 22న ఉదయం 10 గంటలకు విజయవాడ బందరు రోడ్‌లోని టాగూర్‌ స్మారక గ్రంథాలయంలో జరగనుంది. మల్లెతీగ కార్టూన్ల పోటీ విజేతలకు బహుమతి ప్రదానం కూడా జరగనుంది.
తెలంగాణ కళాభారతి(ఎన్టీఆర్‌ స్టేడియం)లో జరుగుతున్న ‘హైదరాబాద్‌ ఫెస్ట్‌’లో భాగంగా మఖ్దూం మొహియుద్దీన్‌ వేదిక మీద ‘సృజన స్వరం’ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 21 వరకు ప్రతిరోజూ సాయంత్రం 5:30కు సాహిత్య సమావేశం, 7 గంటలకు కవి సమ్మేళనం జరగనున్నాయి.


పోతులూరి వీరబ్రహ్మం జీవిత సాహిత్యాలపై రచనలను వెలువరిస్తున్నామనీ, మే 10లోపు వ్యాసాలు పంపమనీ కోరుతున్నారు ‘ప్రజాశక్తి’  జనరల్‌ మేనేజర్‌ కె.లక్ష్మయ్య. ఫోన్‌: 9490099057.
ఒద్దిరాజు సోదరుల స్మృత్యంకంగా 1996 నుండి ఇస్తున్న ‘సహృదయ సాహితీ పురస్కారం’ కోసం 2017 సంవత్సరానికిగానూ 2013–17 మధ్య ముద్రించబడిన స్వీయ కథాసంపుటాలను ఆహ్వానిస్తున్నారు. కథకులు మూడు ప్రతులను 15 జూన్‌ లోగా కుందావజ్జల కృష్ణమూర్తి, ప్లాట్‌: 207, ఇం.నం. 2–7–580, సెంట్రల్‌ ఎక్సయిజ్‌ కాలనీ, హన్మకొండ– 506001 చిరునామాకు పంపవచ్చు. ఫోన్‌: 9849366652 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement