జేబుర్దస్త్‌

Embroidery Pockets Appear to be more Attractive - Sakshi

అమ్మాయిలు సంపాదిస్తున్నారు.దాచిపెట్టుకుంటున్నారు.ఖర్చుపెట్టుకుంటున్నారు.. అబ్బాయిలకంటే ఎక్కువే..మరి జేబులు ఎందుకు తక్కువ? ఎస్‌..!అమ్మాయిలకీ జేబులుండాలి. జేబుర్దస్త్‌గా జీవించాలి.

పాకెట్స్‌ ప్యాంట్స్‌కి ఉండాలి.. లెహంగాలకు కూడానా! అని ఆశ్చర్యపోనక్కర్లేదు. సెల్‌ఫోన్, డబ్బులు వంటి అత్యవసరమైన కొన్నింటిని ఎక్కడకు వెళ్లినా తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాల్సిందే!వేడుకల్లో పాల్గొవాల్సి వచ్చినా, క్యాజువల్‌గా బయటకువెళ్లాలనుకున్నా వెంట ఓ బ్యాగ్‌ మోత ఇప్పుడిక అవసరంలేదు. పార్టీవేర్‌ లెహంగాలకు కూడా పాకెట్స్‌ వచ్చాయి.ఎంబ్రాయిడరీ లెహంగాలైతే పాకెట్‌కూ ఎంబ్రాయిడరీఉంటుంది. ప్లెయిన్‌ లెహంగాలైతే ప్లెయిన్‌ పాకెట్స్‌ ఉంటున్నాయి. కొన్ని ప్లెయిన్‌ లెహంగాలకు ఎంబ్రాయిడరీచేసిన పాకెట్స్‌ మరింత ఆకర్షణయంగా కనిపిస్తున్నాయి. ఇక నుంచీ మీరూ లెహంగాలకు జేబులు కుట్టించుకొని జేబుర్దస్త్‌గా నయా స్టైల్‌కి వెల్‌కమ్‌ చెప్పచ్చు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top