ఇంట్లో తాగునీటి శుద్ధి–నిల్వపై ఫిబ్రవరిలో చర్చాగోష్టి

Drinking water storage at home Discussion in February - Sakshi

ఆర్‌.ఓ. పద్ధతిలో శుద్ధి చేసిన నీటిని తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్న నేపథ్యంలో జాతీయ గ్రామీణాభివృద్ధి–పంచాయతీరాజ్‌ సంస్థ (ఎన్‌.ఐ.ఆర్‌.డి.పి.ఆర్‌.), ఎస్‌.ఎం.సెహగల్‌ ఫౌండేషన్‌లు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వాడుకలో ఉన్న మెరుగైన ‘ఇంటి స్థాయిలో తాగునీటి శుద్ధి– నిల్వ పద్ధతుల’పై అనుభవాలను పంచుకునేందుకు, జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు ఫిబ్రవరి 27–28 తేదీల్లో హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఎన్‌.ఐ.ఆర్‌.డి.పి.ఆర్‌.లో చర్చాగోష్టి జరగనుంది. కెనడాకు చెందిన సెంటర్‌ ఫర్‌ అఫార్డబుల్‌ వాటర్‌ శానిటేషన్‌ టెక్నాలజీ ఈ వర్క్‌షాపునకు నాలెడ్జ్‌ పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. నీటిశుద్ధి–నిల్వ సాంకేతికతల డెవలపర్లు, టెక్నాలజీ ప్రొవైడర్లు, వీటిని అనుసరిస్తున్నవారు తమ అనుభవాలను పంచుకోవచ్చు, మెరుగుపరుచుకోవచ్చు. తాము వాడుతున్న ప్యూరిఫయ్యర్లను ప్రదర్శించవచ్చు. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్లు/పోస్టర్లను చూపించి చర్చలో పాల్గొనవచ్చు. ఆసక్తి గల వారు ఫిబ్రవరి 7లోగా వివరాలు పంపాలి. వివరాలకు.. అపరాజిత–98012 73123. Email: a.vaibhav@smsfoundation.org   

మార్చిలో జాతీయ శాశ్వత వ్యవసాయ మహాసభ
అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ ఆధ్వర్యంలో మార్చి 6 నుంచి 8వ తేదీ వరకు జాతీయ శాశ్వత వ్యవసాయ(పర్మాకల్చర్‌) మహాసభ సంగారెడ్డి జిల్లా (జహీరాబాద్‌ సమీపంలోని) బిడకన్నె గ్రామంలోని వ్యవసాయ శిక్షణా క్షేత్రంలో జరగనుంది.

‘భూతాపోన్నతి – శాశ్వత వ్యవసాయ పరిష్కారాలు’ అనే అంశంపై ఈ మహాసభలో విస్తృత చర్చ జరుగుతుంది. పర్యావరణపరమైన సుస్థిరతను అందించే రసాయనిక అవశేషాల్లేని ఆహారోత్పత్తి సాధనకు దోహదపడే జీవవైవిధ్య, ప్రకృతి వ్యవసాయ పద్ధతులకు ఈ మహాసభ వేదిక కానుంది. రిజిస్ట్రేషన్‌ తదితర సమాచారం కోసం సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్‌ 75697 20601. E-mail id : aranyahyd@gmail.com

చిరుధాన్య వంటకాలపై 18న ఐ.ఐ.ఎం.ఆర్‌.లో శిక్షణ
వర్షాధారంగా పండే చిరుధాన్యాలలో సకల పోషకాలు ఉన్నాయి. వీటిని మూలాహారంగా తీసుకుంటే జీవనశైలి వ్యాధులు సైతం నయం అవుతాయి. అయితే, వీటితో సంప్రదాయ వంటకాలతో పాటు ఆధునిక వంటకాలను కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు అని హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని భారతీయ చిరుధాన్య పరిశోధనా సంస్థ–ఐ.ఐ.ఎం.ఆర్‌. (కేంద్ర ప్రభుత్వ సంస్థ) చెబుతోంది. చిరుధాన్య వంటకాల తయారీపై కుకింగ్‌ విత్‌ మిల్లెట్స్‌ పేరిట గృహిణులు, హోటళ్ల నిర్వాహకులు, స్టార్టప్‌ సంస్థల వ్యవస్థాపకులకు ఈ నెల 18(శనివారం)న ఐ.ఐ.ఎం.ఆర్‌.లోని న్యూట్రిహబ్‌ శిక్షణ ఇవ్వనుంది. ఫీజు రూ. 1,500. పేర్ల రిజిస్ట్రేషన్, ఇతర వివరాల కోసం..
nutrihubtbi@gmail.com 040-24599379/ 29885838 / Mobile - 9490476098
www.millets.res.inwww.nutrihub-tbi-iimr.org
 

మట్టి ద్రావణంతో చీడపీడల నివారణపై 19న శిక్షణ
ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ క్షేత్రాల్లో మట్టి ద్రావణంతో వివిధ పంటల్లో చీడపీడల నివారణ  పద్ధతులపై ప్రసిద్ధ రైతు శాస్త్రవేత్త, మట్టి ద్రావణ ంపై పేటెంట్‌ పొందిన చింతల వెంకటరెడ్డి ఈ నెల 19(ఆదివారం)న గుంటూరు జిల్లా కొర్నెపాడులోని తమ శిక్షణా కేంద్రంలో రైతులకు శిక్షణ ఇస్తారని రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. ముందుగా పేర్లు నమోదుకు సంప్రదించాల్సిన నంబర్లు.. 97053 83666, 0863–2286255.

22న విజయవాడలో మామిడి రైతులకు శిక్షణ
గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఈనెల 22(శుక్రవారం)న విజయవాడ పడమట లంకలోని రైతు శిక్షణా కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మామిడి సాగుపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు శిక్షణ ఇస్తారు. భోజన సదుపాయం ఉంది. విజయవంతంగా సాగు చేస్తున్న రైతులు పాల్గొని ఇతర రైతులతో అనుభవాలను పంచుకోవలసిందిగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం కోరుతోంది. వివరాలకు.. జగదీష్‌ – 78934 56163.  

29న చోహన్‌ క్యు, సీవీఆర్‌ సాగు పద్ధతులపై శిక్షణ
రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం రిక్వెల్‌ ఫోర్డ్‌ ఇంటర్‌ నేషనల్‌ స్కూల్‌ వద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 29న ఉ. 9 గం. నుంచి సా. 6 గం. వరకు డా. చోహాన్‌ క్యు(దక్షిణ కొరియా) ప్రకృతి వ్యవసాయ పద్ధతిపై నిపుణురాలు, ‘సర్ర’ డైరెక్టర్‌ రోహిణీ రెడ్డి (బెంగళూరు), మట్టి సేద్యం ఆవిష్కర్త చింతల వెంకట రెడ్డి(హైదరాబాద్‌) రైతులకు శిక్షణ ఇస్తారని న్యూలైఫ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు శివ షిండే తెలిపారు. చోహన్‌క్యు పద్ధతిపై తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన పరిశోధనా ఫలితాలను అధ్యాపకులు తెలియజేస్తారు. చోహన్‌క్యు రూపొందించిన ఫెయిత్‌ (ఫుడ్‌ ఆల్వేస్‌ ఇన్‌ ద హోమ్‌) బెడ్‌ తయారీ పద్ధతిలో కూరగాయల సాగుపై ప్రత్యక్ష శిక్షణ ఇస్తారు. భోజన సదుపాయం ఉంది.  ఆసక్తి గల రైతులు ఈ నెల 20 లోగా రూ. 200 చెల్లించి ముందాగా పేర్లు నమోదు చేయించుకోవాలి. వివరాలకు.. సంపత్‌కుమార్‌ – 98854 55650, నీలిమ – 99636 23529.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top