కేన్సర్‌ కణాలను నిద్రపుచ్చారు!

Cancer cells are sleeping - Sakshi

కేన్సర్‌పై పోరులో మెల్‌బోర్న్‌ శాస్త్రవేత్తలు ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా కేన్సర్‌ కణాలను శాశ్వత నిద్రలోకి పంపే ఓ మందును సిద్ధం చేశారు. నేచర్‌ జర్నల్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం ఈ మందు... కణితి పెరుగుదలను అడ్డుకోవడమే కాకుండా సాధారణ కణాల డీఎన్‌ఏను ఏ మాత్రం మార్పు చేయకుండా పని చేస్తుంది. రక్త, కాలేయ కేన్సర్ల విషయంలో తాము ఇప్పటికే జంతువులపై ప్రయోగాలు చేసి మంచి ఫలితాలు పొందామని, ఈ మందుతో కేన్సర్‌ మళ్లీ తిరగబెట్టడమన్నది కూడా చాలా ఆలస్యంగా జరుగుతుందని టిమ్‌ థామస్‌ అనే శాస్త్రవేత్త తన పరిశోధన వ్యాసంలో పేర్కొన్నారు.

కేఈటీ 6ఏ, కేఏటీ 6బీ అనే రెండు ప్రొటీన్ల ఉత్పత్తిని నిలిపివేస్తే కేన్సర్‌కు సమర్థమైన చికిత్స కల్పించవచ్చా? అన్న ప్రశ్న ఆధారంగా తాము పరిశోధనలు మొదలుపెట్టామని ఆయన చెప్పారు. ప్రత్యేకమైన మందు సాయంతో  కేఏటీ 6ఏ ఉత్పత్తిని నిలిపివేయగానే  రక్తపు కేన్సర్లు ఉన్న ఎలుకల ఆయుష్షు నాలుగింతలైందని చెప్పారు. ప్రస్తుతం కేన్సర్‌ చికిత్సకు వాడే కీమోథెరపీ, రేడియేషన్‌ల వల్ల సాధారణ కణాల డీఎన్‌ఏ లో సరిచేయలేని మార్పులు చోటు చేసుకుంటాయని, దీని ఫలితంగా అనేక సైడ్‌ఎఫెక్ట్స్‌ కనిపిస్తాయని మనకు తెలుసు. తాము సిద్ధం చేసిన మందు మాత్రం కేన్సర్‌ కణాలు విభజితం కాకుండా అడ్డుకుంటాయని.. ఇంకోలా చెప్పాలంటే కణాలు మరణించవుగానీ.. పునరుత్పత్తి చేయలేని స్థితికి చేరుకుంటాయని వివరించారు. 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top