మచ్చలేని బ్యాక్‌ | Beauty Tips For Skin In Sakshi Family | Sakshi
Sakshi News home page

మచ్చలేని బ్యాక్‌

Jan 10 2020 4:53 AM | Updated on Jan 10 2020 4:53 AM

Beauty Tips For Skin In Sakshi Family

పండగ సీజన్‌.. ఆ తర్వాత పెళ్లిళ్ళ సీజన్‌.. వేడుకలకు ముగింపు అంటూ లేదు. పాశ్చాత్యమైన, సంప్రదాయమైన ఏ వేడుకైనా వేసుకునే దుస్తుల్లో లో బ్యాక్, బ్యాక్‌లెస్‌ బ్లౌజ్‌లు, గౌన్లు ధరిస్తుంటుంది యువత. ఇలాంటప్పుడు వీపు భాగం మచ్చలు లేకుండా నునుపుగా, మెరుపుగా ఉండాలంటే తప్పనిసరి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. 

బ్యాక్‌ ఫేసియల్‌ వర్క్స్‌
►కొన్ని గంటల పాటు వీపుభాగం కాంతివంతంగా కనిపించాలంటే ముఖానికి మాదిరిగా బ్యాక్‌ ఫేసియల్‌ చేయించడం సరైన ఎంపిక. బ్యాక్‌ మసాజ్‌ వల్ల కండరాలు విశ్రాంతి పొందడం వల్ల కూడా చర్మకాంతి పెరుగుతుంది
►పార్టీ లేదా ఏదైనా వేడుకకు ముందు క్లెన్సింగ్, స్క్రబ్బింగ్, మసాజ్‌ వంటివి చేయించడం, డి–ట్యాన్‌ ఉత్పాదనలు వాడటం వల్ల కూడా మెరుగైన ఫలితాలు పొందవచ్చు. ఈ విధానం వల్ల నిస్తేజంగా మారిన మృతకణాలు చర్మం నుంచి దూరమై మేనికాంతి పెరుగుతుంది.
పిగ్మెంటేషన్‌: యాక్నె, మొటిమలు, పిగ్మెంటేషన్‌ వల్ల అవి తగ్గినా ఆ తర్వాత చర్మంపై మచ్చలు కనిపిస్తుంటాయి. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు వైద్యుల సూచనల తీసుకొని చర్మకాంతి ఉత్పాదనలు వాడడమైనా, చికిత్స అయినా చేయించుకోవడం మంచిది. 
►కెమికల్‌ పీల్‌: కొన్ని చర్మసమస్యలకు రసాయనాలను ఉపయోగించే చేసే చికిత్స మెరుగైన ఫలితాలను ఇవ్వచ్చు. పార్టీ లేదా వేడుకకు వారం రోజుల ముందుగానే కెమికల్‌ పీలింగ్‌ చేయించుకోవడం వల్ల సరైన ఫలితాన్ని పొందవచ్చు. ఇందుకు చర్మ సంబంధ వైద్యల సూచన తీసుకోవడం తప్పనిసరి.

నానమ్మ కాలం నాటి విధానాలు
వెనుకటి రోజుల్లో ఇంట్లోనే కొన్ని సౌందర్య ఉత్పాదనలు తయారుచేసుకొని చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకునేవారు. 
►పసుపులో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి చర్మ రంధ్రాలలో పేరుకుపోయిన మురికిని కూడా వదిలించగలవు. మీగడలో పసుపు, తేనె కలిపి చిక్కటి మిశ్రమం తయారుచేసుకొని దానిని వీపుకు పట్టించాలి. వేళ్లతో 2–3 నిమిషాలు మృదువుగా మర్దన చేయాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజూ ఈ విధంగా చేస్తూ ఉంటే చర్మకాంతిలో వచ్చే మార్పులు మీరే గమనిస్తారు ►బంగాళదుంపను తురిమి ఆ మిశ్రమంతో వీపుభాగాన్ని రుద్దాలి. ఇది చర్మకాంతికి త్వరితమైన ఫలితాన్ని సూచిస్తుంది
►సహజసిద్ధమైన స్క్రబ్‌తో మెరుగైన ఫలితాలను పొందవచ్చు. అందుకు నిమ్మరసం, పంచదార పలుకులు కలిపి వీపుకు పట్టించి, మృదువుగా రుద్దాలి. దీని వల్ల చర్మంపై ఉన్న మృతకణాల సంఖ్య తగ్గుతుంది. చర్మం రంగు పెరగడానికి బ్లీచ్‌లా సహాయపడుతుంది
►మరొక మేలైన మిశ్రమం కాఫీ పొడి, తేనె. ఈ రెంటినీ కలిపి వీపు భాగానికి పట్టించి, 2–3 నిమిషాలు మృదువుగా రబ్‌ చేయాలి. తర్వాత కడిగేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement