దాన శీలం | Authyme donate | Sakshi
Sakshi News home page

దాన శీలం

May 9 2017 12:34 AM | Updated on Sep 5 2017 10:42 AM

దాన  శీలం

దాన శీలం

దానం... ధర్మం మన సంప్రదాయంలో భాగం. దానగుణం కొందరికి పెద్దల నుంచి

ఆత్మీయం

దానం... ధర్మం మన సంప్రదాయంలో భాగం. దానగుణం కొందరికి పెద్దల నుంచి అబ్బితే, ఇంకొందరికి స్వతహాగానే అలవడుతుంది. కొందరు చేతికి ఎముక లేనట్టు విరివిగా దానాలు చేస్తే, మరి కొందరు అవతలివారి అవసరానికి సరిపడేలా లేదా తమ స్తోమతకు తగ్గట్టు చేస్తారు. దాత తెలుసుకోవలసిందేమంటే, దానం అంటే మనకు అవసరం లేనివాటిని లేదా పనికి రానివాటిని వదిలించుకునేందుకు చేసేది కాదు... మనం దానం చేస్తున్నాము కదా అని దానం పుచ్చుకునే వారిని చిన్నచూపు చూడకూడదు. ఇంత చేశాం అంత చేశాం అని గప్పాలు కొట్టుకోకూడదు.

తన నుంచి దానం గ్రహించిన వ్యక్తి ఎక్కడయినా కనపడితే, అతను తనవల్లే బతుకుతున్నాడు అని గొప్పలు చెప్పుకోకూడదు. లోపాలు ఉన్న వాటిని, అయోగ్యమైన వాటిని దానం పేరుతో వదిలించుకోకూడదు. దానం చేసిన తర్వాత అయ్యో, నాకిష్టమైన దానిని ఇచ్చానే అని బాధపడుతూ, దాని మీద మమకారాన్ని వదులుకోవాలి. సహాయం అవసరమై ఎవరైనా వస్తే రేపు రా మాపురా అని తిప్పుకోకూడదు. అన్నిటినీ మించి కుడి చేతితో ఇచ్చిన దానాన్ని ఎడమ చేతికి కూడా తెలియకుండా చేయాలి. అలాంటివారే ఉత్తమ దాతలు. శ్రేష్టమైన వాటినే దానం చేయాలి. అలా ఉత్తమ దానాలు చేయబట్టే కర్ణుడు, ధర్మరాజు వంటివారు గొప్ప దానశీలురుగా నేటికీ కొనియాడబడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement