గీత స్మరణం | 1 nenokkadine song | Sakshi
Sakshi News home page

గీత స్మరణం

Jan 9 2014 12:13 AM | Updated on Sep 2 2017 2:24 AM

గీత స్మరణం

గీత స్మరణం

చెలి చెలి చెలియా చెదిరిన కలయా నువు పలకని మాటలాగ

పల్లవి :
 
 చెలి చెలి చెలియా చెదిరిన కలయా
 నువు పలకని మాటలాగ
   నను మార్చమాకె సఖియా
 చెలి చెలి చెలియా చెదిరిన కలయా
 నువు చూడని చోటులాగ
   నను చేయమాకె సఖియా
 అలై నువ్వే నను వీడినా
   వెనకే సంద్రం నేనై
 ఇలా రానా నీ చుట్టూ నిలవనా ప్రాణాలా వలై
 ఓ సయొనరా సయొనరా సయొనరా సెలవంటు
 నా చె లిమికే విసరకే చీకటి తెర
 ॥చెలి॥
 
 చరణం : 1
 
 నీతో ఎన్నడూ వచ్చే నీడనై నిఘా నేనేగా
 నువ్వు ఎప్పుడూ శ్వాసించే గాలినై నిఘా నేనేగా
 ఓ... పువ్వులాగ నిన్ను చూడాలంటూ ముళ్లైపోతా
 ముత్యంలాగ నిను దాచే ఉప్పునీరైపోతా
 ఆపదొచ్చి నిను గుచ్చుకుంటే
   ఆపే మొదటి గాయం నేనే ఔతా
 ॥సయొనరా॥
 
 చరణం : 2
 
 నిశ్శబ్దంలోన నీ గుండుచప్పుడై ఉంటా తోడుంటా
 శబ్దాలెన్నున్నా నీ రెప్పలచప్పుడే వింటా నే వింటా
 ఓ... చేదు క లలకు మేలకువలాగ వస్తా
 బాధ మేలుకుంటే నిదరై కాపుకాస్తా
 వేదనలికింకా వీడుకోలు పలికే చివరి కన్నీటి చుక్కైపోతా
 ॥సయొనరా॥
 
 చిత్రం : ‘1’ నేనొక్కడినే (2014)
 రచన : చంద్రబోస్, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
 గానం : సూరజ్ సంతోష్, ఎం.ఎం.మానసి

 

Advertisement
 
Advertisement
Advertisement