టీఆర్‌ఎస్ మలి జాబితా | TRS party releases second list of elections | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ మలి జాబితా

Apr 6 2014 4:58 AM | Updated on Aug 29 2018 8:54 PM

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ తరఫున బరిలోకి దింపే అభ్యర్థులకు సంబంధించిన రెండో జాబితాను టీఆర్‌ఎస్ శనివారం ప్రకటించింది.

8 లోక్‌సభ, 4 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులు
నాగర్‌కర్నూల్‌లో మందా, వరంగల్‌కు కడియం
నిజామాబాద్ రూరల్ బాజిరెడ్డికి
మల్కాజిగిరి అసెంబ్లీ కనకారెడ్డికి

 
సాక్షి, హైదరాబాద్:
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ తరఫున బరిలోకి దింపే అభ్యర్థులకు సంబంధించిన రెండో జాబితాను టీఆర్‌ఎస్ శనివారం ప్రకటించింది. ఈ జాబితాలో ఎనిమిది లోక్‌సభ, నాలుగు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. సిట్టింగ్ ఎంపీ మందా జగన్నాథంను మళ్లీ నాగర్ కర్నూల్ నుంచే రంగంలో దింపారు. అలాగే వరంగల్ నుంచి కడియం శ్రీహరి, సికింద్రాబాద్ నుంచి తూం భీంసేన్ పోటీ చేయనున్నారు. శుక్రవారమే పార్టీలో చేరిన బాజిరెడ్డి గోవర్ధన్‌కు నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు. కాగా.. పరకాల సిట్టింగ్ ఎమ్మెల్యే భిక్షపతితో పాటు కాంగ్రెస్ నుంచి ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన మల్కాజిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ పేర్లు ఈ జాబితాలో కూడా లేవు. మల్కాజిగిరి అసెంబ్లీ స్థానాన్ని కనకారెడ్డికి ఇచ్చారు. దాంతో ఆకుల రాజేందర్ పార్లమెంట్‌కు పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
 
 లోక్‌సభ స్థానాలు
 నియోజకవర్గం    అభ్యర్థి
 నాగర్‌కర్నూల్        మందా జగన్నాథం
 భువనగిరి        బూర నర్సయ్యగౌడ్
 మహబూబ్‌నగర్        ఏపీ జితేందర్‌రెడ్డి
 వరంగల్        కడియం శ్రీహరి
 కరీంనగర్        బి.వినోద్‌కుమార్
 చేవెళ్ల        కొండా విశ్వేశ్వరరెడ్డి
 నల్లగొండ        పల్లా రాజేశ్వర్‌రెడ్డి
 సికింద్రాబాద్        తూం భీం సేన్
 అసెంబ్లీ స్థానాలు
 నియోజకవర్గం        అభ్యర్థి
 నిజామాబాద్ రూరల్    బాజిరెడ్డి గోవర్ధన్
 మల్కాజిగిరి        సిహెచ్.కనకారెడ్డి
 షాద్‌నగర్        వై.అంజయ్య యాదవ్
 కోదాడ        కె. శశిధర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement