పోలీసు బాస్ ఓటు గల్లంతు.. | police boss vote missing | Sakshi
Sakshi News home page

పోలీసు బాస్ ఓటు గల్లంతు..

Apr 18 2014 1:35 AM | Updated on Sep 17 2018 6:08 PM

పోలీసు బాస్ ఓటు గల్లంతు.. - Sakshi

పోలీసు బాస్ ఓటు గల్లంతు..

బీహార్ డీజీపీ అభయానంద్ ఓటు గల్లంతవడంతో గురువారం ఆయన ఓటు వేయకుండానే పోలింగ్ బూత్ నుంచి వెనుదిరిగారు.

బీహార్ డీజీపీ అభయానంద్ ఓటు గల్లంతవడంతో గురువారం ఆయన ఓటు వేయకుండానే పోలింగ్ బూత్ నుంచి వెనుదిరిగారు. పాట్నా సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం శాస్త్రినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పటేల్ నగర్‌లో ఉన్న సొంత ఇంట్లో డీజీపీ నివాసం ఉంటున్నారు. ఓటు వేసేందుకు ఉదయమే ఆయన పోలింగ్ బూత్ వద్దకు వెళ్లారు. ఓటర్ల జాబితాలో పేరు కనిపించకపోవడంతో ఓటు వేయలేకపోయారు.
 
 బీహార్ పోలీసు బాస్‌కు ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. గత సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆయనకు ఇదే అనుభవం ఎదురైంది. కాగా, కీలకమైన పాట్నాసాహిబ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా, కాంగ్రెస్ తరఫున భోజ్‌పురి నటుడు కునాల్ సింగ్, జేడీయూ అభ్యర్థిగా గోపాల్‌ప్రసాద్ సిన్హా, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి పర్వీన్ అమానుల్లా బరిలో ఉన్న సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement