ప్రజల సైగలతో బాలయ్యకు షాక్! | People shock to Balakrishna | Sakshi
Sakshi News home page

ప్రజల సైగలతో బాలయ్యకు షాక్!

May 4 2014 8:16 PM | Updated on Aug 29 2018 1:59 PM

ప్రజల సైగలతో బాలయ్యకు షాక్! - Sakshi

ప్రజల సైగలతో బాలయ్యకు షాక్!

అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం చలివెందులలో టిడిపి అభ్యర్ధి బాలకృష్ణకు చుక్కెదురైంది.

హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం చలివెందులలో టిడిపి అభ్యర్ధి బాలకృష్ణకు చుక్కెదురైంది. ప్రజల సైగలు ఆయనకు షాక్ ఇచ్చాయి. చలివెందుల గ్రామంలో టిడిపికి ఓటు వెయ్యాలని బాలయ్య విక్టరీ సింబల్ చూపించారు. అందుకు ప్రతిగా అక్కడ గుమిగూడిన జనం ఫ్యాన్ తిరుగుతున్నట్లు చేతితో  సైగలు చేశారు. చేతులు తిప్పుతూ ఫ్యాన్ తిరిగినట్లు చూపారు. దాంతో బాలయ్యకు మతిపోయినట్లు అయింది.

 

ఆ గ్రామంలో వైఎస్ఆర్ సిపి అభిమానులు అధికమంది ఉన్నట్లున్నారు. అందుకే వారు ఆ పార్టీ గుర్తు ఫ్యాన్ తిరుగుతున్న సైగలు చేశారు. అంతేకాకుండా బాలయ్య సమక్షంలో జగన్ జిందాబాద్ అని కూడా వారు నినాదాలు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement