'రాజకీయాల్లో ఉంటూనే సినిమాల్లో నటిస్తా'
శ్రీకాకుళం: రాజకీయాల్లో ఉంటూనే సినిమాల్లో నటిస్తానని నందమూరి బాలకృష్ణ చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవడం ఆయన వ్యక్తిగతమన్నారు. ఎవరినీ బొట్టుపెట్టి పిలవాల్సిన అవసరం లేదన్నారు. ప్రతిఒక్కరూ కార్యకర్తగా భావించి పార్టీ కోసం పనిచేయాలని అన్నారు.
అధిష్టానం ఆదేశిస్తే తన సోదరి పురందేశ్వరి తరపున రాజంపేటలో ప్రచారం చేస్తానని బాలకృష్ణ తెలిపారు. రాజంపేట లోకసభ స్థానం నుంచి పురందేశ్వరి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. నరసన్నపేట నియోజకవర్గం పరిధిలో సోమవారం ప్రచారం నిర్వహించారు.