రానున్నది వైఎస్సార్ సీపీ ప్రభంజనమేనని ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు అన్నారు.
కడియం, న్యూస్‌లైన్ : రానున్నది వైఎస్సార్ సీపీ ప్రభంజనమేనని ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు అన్నారు. సోమవారం వీరవరంలో రాజమండ్రి రూరల్ అసెంబ్లీ అభ్యర్థి ఆకుల వీర్రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొడ్డు మాట్లాడుతూ సంక్షేమరాజ్య స్థాపనే జగన్ మోహన్‌రెడ్డి లక్ష్యమన్నారు. వైఎ స్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
పార్టీలో పలువురి చేరిక
వివిధ గ్రామాల నుంచి పలువురు నాయకులు వైఎస్సార్ సీపీలో చేరారు. కీలకనేతలు ఆకుల వీర్రాజుకు మద్దతునిచ్చారు. జెడ్పీటీసీ మాజీ సభ్యులు దొంతంశెట్టి వీరభద్రయ్య, బత్తుల రా ము, మాజీ ఎంపీటీసీ సభ్యులు రేమళ్ల ప్రసాద్, లంక కనకారావు, రేమళ్ల పరమేష్, వీరవరం సర్పంచ్ పరమటి భాగ్యవతి, ఉప సర్పంచ్ కొత్తపల్లి లక్ష్మణరావు, దొంతంశెట్టి చినవీర్రాజు, బత్తుల బ్రహ్మయూత్ సభ్యులు, చేనేత సొసైటీ అధ్యక్షుడు కర్రా సూర్యచంద్రరావు, ఆదిమూ లం పెద్దబ్బు, దొంతంశెట్టి ఏకాంబరం, దోర శ్రీనివాసు సహా వందలాది మంది పార్టీలో చేరా రు. వీరిని బొడ్డు, ఆకుల సాదరంగా ఆహ్వానిం చారు. పొట్టిలంకలో సొసైటీ మాజీ అధ్యక్షుడు పాటంశెట్టి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో వందమంది, మురమండలో పలువురు చేనేత నాయకులు పార్టీలో చేరారు. రావి పాటి రామచంద్రరావు, యాదల సతీష్‌చంద్రస్టాలిన్, గిరజాల బాబు, దాసరి శేషగిరి పాల్గొన్నారు.