బిజెపిలో చేరిన కావూరి సాంబశివరావు | Kavuri Sambasiva Rao joined in BJP | Sakshi
Sakshi News home page

బిజెపిలో చేరిన కావూరి సాంబశివరావు

May 1 2014 5:38 PM | Updated on Mar 29 2019 9:24 PM

కావూరి సాంబశివరావు - Sakshi

కావూరి సాంబశివరావు

కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు ఈరోజు ఇక్కడ గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సమక్షంలో బిజెపిలో చేరారు.

భీమవరం: కేంద్ర మాజీ మంత్రి  కావూరి సాంబశివరావు ఈరోజు ఇక్కడ గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సమక్షంలో  బిజెపిలో చేరారు. భారత్ విజయ్ బహిరంగ సభా వేదికపైకి వచ్చిన కావూరి మోడీని భారీ పూల మాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కావూరి మాట్లాడుతూ దేశానికి ప్రధాని కాగల అర్హత మోడీకి ఉందన్నారు.

దీర్ఘకాలం పాటు కాంగ్రెస్లో కొనసాగిన  కావూరి రాష్ట్ర విభజన నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం కేంద్రమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తరువాత  రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోవాలో అర్ధంకాని  అయోమయ స్థితిలో ఆయన కొంతకాలం ఉన్నారు.  టీడీపీలో చేరేందుకు ప్రయత్నించి విరమించుకున్నట్లు తెలిసింది. చివరకు ఈరోజు ఆయన బిజెపిలో చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement