పశ్చిమగోదావరి జిల్లా తణుకు అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సత్యనారాయణ అనుమానాస్పద స్థితిలో మరణించారు.
పశ్చిమగోదావరి జిల్లా తణుకు అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సత్యనారాయణ అనుమానాస్పద స్థితిలో మరణించారు. మరో పదిరోజుల్లో ఎన్నికలు ఉన్నాయనగా ఆయన మరణించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కుటుంబకలహాల నేపథ్యంలో బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తుంటే... అతని కుటుంబసభ్యులు మాత్రం దీనిపై పెద్దగా స్పందించడం లేదు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు... మృతుడిది సహజ మరణమా లేదా ఆత్మహత్య అన్న కోణంలో విచారణ సాగిస్తున్నారు.