జోరుగా వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ప్రచారం


నారాయణఖేడ్, న్యూస్‌లైన్:  స్థానిక జెడ్పీటీసీ స్థానం నుంచి పోటీ చేస్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థి మహానంద షెట్కార్‌తోపాటు ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున ఆ పార్టీ నాయకులు ముమ్మర ప్రచారాన్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నారాయణఖేడ్ పట్టణంలోని మార్వాడిగల్లి, గౌలిగల్లిలో ముమ్మర ప్రచారం నిర్వహించారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా ఓటర్లకు వివరించారు. మహానేత వైఎస్సార్ మరణం తరువాత రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని వైఎస్సార్ సీపీ నాయకులు తెలిపారు. వైఎస్సార్ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కావాలంటే వైఎస్సార్ సీపీకి అండగా నిలవాలని వారు కోరారు. ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా తమ పార్టీ కృషి చేస్తుందని వారు హామీ ఇచ్చారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో వైఎస్సార్ సీపీ నాయకులు డాక్టర్ విజయ్‌కుమార్ షెట్కార్, శ్రీదేవి షెట్కార్, ఉమాదేవి, నీరజ, లక్ష్మి, ఎంపీటీసీ అభ్యర్థులు సంగమేశ్వర్, రాణి, సుధాకర్, ఫయాజ్, నరేష్ యాదవ్, సత్యనారాయణ, దత్తు, విజయ్, సంజీవ్‌రెడ్డి, సుధాకర్, తుకారాం తదితరులు పాల్గొన్నారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top