నాన్న బాటలోనే.. | Along the way with my father ... | Sakshi
Sakshi News home page

నాన్న బాటలోనే..

Apr 27 2014 2:26 AM | Updated on Aug 29 2018 1:59 PM

నాన్న బాటలోనే.. - Sakshi

నాన్న బాటలోనే..

తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే తన తండ్రి ఎన్టీఆర్ బాటలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని హిందూపురం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి బాలకృష్ణ అన్నారు.

 హిందూపురాన్ని ఎన్టీఆర్ జిల్లాగా మారుస్తా: బాలకృష్ణ
 

 పెనుకొండ/మడకశిర  తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే తన తండ్రి ఎన్టీఆర్ బాటలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని హిందూపురం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి బాలకృష్ణ అన్నారు. శనివారం ఆయన అనంతపురం జిల్లా పెనుకొండ, మడకశిర నియోజకవర్గంలోని గుడిబండలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు.   శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను పెనుకొండకు తెస్తామని, పరిశ్రమలు పెట్టి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

పెనుకొండ ప్రజలకు రూ.2కే మినరల్ వాటర్ క్యాన్ అందిస్తామని, హంద్రీ- నీవా ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. మాజీ మంత్రి రఘువీరారెడ్డి కళ్యాణదుర్గాన్ని రూ.200కోట్లతో అభివృద్ధి చేశానని చెబుతున్నారని, అంత అభివృద్ధి చేసుంటే అక్కడి ప్రజలు ఎందుకు ఆదరించడం లేదని ప్రశ్నించారు.    హిందూపురాన్ని ఎన్టీఆర్ జిల్లాగా మారుస్తామని హామీ ఇచ్చారు. హిందూపురం నియోజకవర్గం పక్కనే ఉన్న మడకశిర నియోజకవర్గాన్ని కూడా తన నియోజకవర్గంగానే చూసుకుంటానని చెప్పారు.  ప్రజలు టీడీపీని ఆదరించాలని ఆయన కోరారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement