యువకుడి ఆత్మహత్య | Youth suicide | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్య

May 2 2017 12:22 AM | Updated on Nov 6 2018 7:53 PM

చిలమత్తూరు పంచాయతీ తుమ్మలకుంట గ్రామానికి చెందిన కె.శ్రీనివాసులు, లక్ష్మీనరసమ్మ కుమారుడు అశోక్‌కుమార్‌ (36) కర్ణాటకలోని నగిరిగెర ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు..

చిలమత్తూరు : చిలమత్తూరు పంచాయతీ తుమ్మలకుంట గ్రామానికి చెందిన కె.శ్రీనివాసులు, లక్ష్మీనరసమ్మ కుమారుడు అశోక్‌కుమార్‌ (36) కర్ణాటకలోని నగిరిగెర ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. అశోక్‌ వ్యవసాయం, చింతపండు తదితర వ్యాపారాలు చేసుకోవడంతో ప్లంబింగ్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వాడు.  నాలుగు రోజుల క్రితం గౌరిబిదునూరు తదితర ప్రాంతాలకు చింతపండు విక్రయించేందుకు వెళ్లాడు. అప్పటి నుంచి అతడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యల్లో భాగంగా నగిరిగెర ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. కాగా ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసి గౌరిబిదునూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement