breaking news
ashokkumar
-
జులాయి కథ!
అశోక్ కుమార్, ప్రియావర్మ జంటగా కె.వి. సాయికృష్ణ దర్శకత్వంలో కె.చంద్రరావు నిర్మిస్తున్న చిత్రం ‘అనగనగా ఒక ఊళ్ళో’. ఈ చిత్రం టీజర్‌ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ– ‘‘టీజర్ అద్భుతంగా ఉంది. దర్శక–నిర్మాతలు చక్కగా తెరకెక్కిస్తున్నారు. రాజమౌళిగారి దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన సాయికృష్ణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘రాజమౌళిగారి దగ్గర డైరెక్షన్లో మెళకువలు నేర్చుకున్నాను. కథ విన్న వెంటనే నిర్మాతలు సినిమా చేయడానికి ముందుకొచ్చారు. జులాయిగా తిరిగే ఓ కుర్రాడు ఎలా ఉన్నత స్థాయికి చేరుకున్నాడు? అన్నదే చిత్రకథ. త్వరలో పాటలను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. -
యువకుడి ఆత్మహత్య
చిలమత్తూరు : చిలమత్తూరు పంచాయతీ తుమ్మలకుంట గ్రామానికి చెందిన కె.శ్రీనివాసులు, లక్ష్మీనరసమ్మ కుమారుడు అశోక్‌కుమార్ (36) కర్ణాటకలోని నగిరిగెర ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. అశోక్ వ్యవసాయం, చింతపండు తదితర వ్యాపారాలు చేసుకోవడంతో ప్లంబింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వాడు. నాలుగు రోజుల క్రితం గౌరిబిదునూరు తదితర ప్రాంతాలకు చింతపండు విక్రయించేందుకు వెళ్లాడు. అప్పటి నుంచి అతడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యల్లో భాగంగా నగిరిగెర ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. కాగా ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసి గౌరిబిదునూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
టమాటాల చోరీ..!
సాక్షి, ముంబై: వినడానికి విచిత్రంగా ఉన్నా ఈ దొంగతనం నిజంగానే జరిగింది. టమాటాల ధరలు ఆకాశాన్నంటుతుండడంతో దొంగల కన్ను ఇప్పుడు టమాటాలపై పడింది. హోల్‌సేల్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుంటున్న దుండగులు ట్రక్కులు తీసుకొచ్చి మరీ టామాటాల పెట్టెలను ఎత్తుకెళ్తున్నారు. తీరా వాటిని రిటెయిల్ మార్కెట్లో బయటికంటే తక్కువ ధరకు అమ్మేసి.. సొమ్ము చేసుకుంటున్నారు. శనివారం తెల్లవారు జామున మీరారోడ్డులోని కాశీగావ్ హోల్‌సేల్ మార్కెట్లో సుమారు 720 కిలోల టమాటాలు చోరీకి గురయ్యాయి. వివరాల్లోకెళ్తే... హోల్‌సేల్ వ్యాపారి అశోక్‌కుమార్ ప్రజాపతి కిలో రూ. 60 ధరతో కొనుక్కొచ్చిన టమాటాలను పెట్టెల్లో నింపి హోల్‌సేల్‌గా విక్రయించేందుకు సిద్ధంగా ఉంచాడు. యజమాని లేని సమయం చూసి దుండగులు ట్రక్కు వేసుకొని వచ్చి క్షణాల్లో పెట్టెలను అందులోకి ఎక్కించుకొని పరారయ్యారు. దీనిని పలువురు చూసినా కొనుగోలు చేసినవారే వాటిని తీసుకెళ్తున్నారమోనని భావించారు. తీరా ప్రజాపతి అక్కడికి వచ్చి చూస్తే కనీసం ఒక్క పెట్టె కూడా కనిపించలేదు. గత 12 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నానని, ఏ ఒక్కరోజు కూడా ఇలా జరగలేదని వాపోయాడు. టమాటాలను గుర్తించకున్నా వాటిని నింపిన పెట్టెలను గుర్తుపట్టగలననే నమ్మకంతో సమీపంలోని రిటెయిల్ మార్కెట్లలో వెతికాడు. దీంతో దహిసర్‌లోని రావల్పాడా మార్కెట్లో తన టమాటాలను గుర్తుతెలియని వ్యక్తులు విక్రయించినట్లు గుర్తించాడు. వెంటనే కాశీమీరా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీని యన్ పోలీస్ ఇన్స్పెక్టర్ అనిల్ కదమ్ ఈ విషయమై మాట్లాడుతూ.. ఈ ఘటన శనివారం తెల్లవారు జామున ఒంటి గంట ప్రాంతంలో చోటుసుకుందని చెప్పారు. అక్కడ 24 పెట్టెల్లో టమాటాలు ఉన్నాయనీ, ప్రతి పెట్టెలో 30 కిలోల టమాటలు ఉన్నాయనిచెప్పారు. చోరీకి గురైన టమాటాల విలువ సుమారు రూ. 60 వేల వరకు ఉంటుందన్నారు. ఇక్కడి నుంచి వాటిని ఎత్తుకెళ్లిన దుండగులు ఒక్కో పెట్టెను రూ. 500 నుంచి రూ. 600 వరకు విక్రయిం చిన ట్లు దర్యాప్తులో తేలిందన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.