యువకుడిపై కత్తులతో దాడి, మృతి | Youngster murdered by assaults with swords attack | Sakshi
Sakshi News home page

యువకుడిపై కత్తులతో దాడి, మృతి

Oct 28 2015 4:06 PM | Updated on Sep 3 2017 11:38 AM

వైన్స్ షాపు ముందు మద్యం కొనుగోలు చేస్తున్న యువకుడిపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు.

జగిత్యాలరూరల్(కరీంనగర్): వైన్స్ షాపు ముందు మద్యం కొనుగోలు చేస్తున్న యువకుడిపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం చనిగల్ గ్రామంలో బుధవారం జరిగింది.

మండలంలోని గోవిందపల్లి గ్రామానికి చెందిన రాకేష్(20) వైన్స్ వద్ద మద్యం కొనుగోలు చేస్తుండగా.. కారులో వచ్చిన నలుగురు దుండగులు కత్తులతో అతనిపై దాడి చేసి పరారయ్యారు. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతిచెందినట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement