ముమ్మరంగా ‘యాదాద్రి’ పనులు
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహా స్వామి దేవస్థానంలో యాదాద్రి ప్రధానాలయ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహా స్వామి దేవస్థానంలో యాదాద్రి ప్రధానాలయ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కొండ చుట్టూ రిటైనింగ్ వాల్ కోసం సుమారు 100 లోతు నుంచి నిర్మాణం చేస్తున్నారు. ఇందులో భాగంగా పిల్లర్లు ప్రస్తుతం భూమికి సమాంతరంగా వచ్చాయి. వైటీడీఏ అధికారుల సూచనల మేరకు సన్‌షైన్ అధికారులు పనులను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రధానాలయంలోని ఆండాళ్ అమ్మవారు, ఆళ్వార్ల విగ్రహాలను కళావిహీనం చేసి స్వయంభుమూర్తుల వద్ద భద్రపరిచారు. మరో రెండు, మూడు రోజుల్లో ఆలయ దక్షిణ భాగం నుంచి పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ధ్వజ స్తంభానికి ఉన్న వెండి తొడుగులు తీసి స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. ఆలయ నిర్మాణ పనులు సీఎం కేసీఆర్ సూచనలు, చినజీయర్‌స్వామి సలహాలను అనుసరించి ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.