తాగునీటి కోసం మహిళల ధర్నా | womens protest for drinking water | Sakshi
Sakshi News home page

తాగునీటి కోసం మహిళల ధర్నా

Jul 26 2016 1:31 AM | Updated on Sep 4 2017 6:14 AM

తాగునీటి కోసం మహిళల ధర్నా

తాగునీటి కోసం మహిళల ధర్నా

నూతనకల్‌ మండలంలోని మామిళ్లమడవ గ్రామంలో తాగునీటి సమస్యను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ మహిళలు ఖాళీ బిందెలతో సోమవారం గ్రామంలో ధర్నా నిర్వహించారు.

నూతనకల్‌
మండలంలోని మామిళ్లమడవ గ్రామంలో తాగునీటి సమస్యను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ మహిళలు ఖాళీ బిందెలతో సోమవారం గ్రామంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ 20రోజుల నుంచి గ్రామంలో తాగునీటి సరఫరా సక్రమంగా లేక అవస్థలు పడుతున్నామన్నారు. గ్రామానికి మంచినీటి సరఫరా చేసే బోరు మోటారు చెడిపోయి 15రోజులు గడిచినా నేటికీ మరమ్మతులు చేయించలేదని ఆరోపించారు. పాలేరు వాగు నుంచి ఊట బావి తవ్వించి మంచినీటి సమస్య పరిష్కరించాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో మహిళలు కావటి మల్లమ్మ, కొంపెల్లి లింగమ్మ, గాడుదుల సుజాత, తండా లక్ష్మి, ఉప్పల సరోజన, మట్టపెల్లి కొమరమ్మ, జ్యోతి, ఉప్పల వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement