నగరంలోని తాడితోట, రెల్లిపేటకు చెందిన వివాహితపై అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి గురువారం ఉదయం లైంగిక దాడి చేశాడు. ప్రకాశ్‌నగర్ సీఐ ఆర్. సుబ్రహ్మణ్యేశ్వరరావు కథనం ప్రకారం ఆ వివాహిత భర్త నుంచి విడాకులు తీసుకుని నాలుగేళ్లుగా రెల్లిపేటలోని తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. అదే ప్రాంతానికి చెందిన వివాహితుడు బంగారు దుర్గారావు ఆమెకు మాయమాటలు చెప్పి బైక్‌పై ఎక్కించుకుని స్థానిక వీఎల్‌పురంలోని ఒక
రాజమహేంద్రవరంలో వివాహితపై లైంగిక దాడి
Nov 3 2016 11:28 PM | Updated on Jul 28 2018 8:53 PM
	రాజమహేంద్రవరం క్రైం :
	 
					
					
					
					
						
					          			
						
				
	నగరంలోని తాడితోట, రెల్లిపేటకు చెందిన వివాహితపై అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి గురువారం ఉదయం లైంగిక దాడి చేశాడు. ప్రకాశ్‌నగర్ సీఐ ఆర్. సుబ్రహ్మణ్యేశ్వరరావు కథనం ప్రకారం ఆ వివాహిత భర్త నుంచి విడాకులు తీసుకుని నాలుగేళ్లుగా రెల్లిపేటలోని తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. అదే ప్రాంతానికి చెందిన వివాహితుడు బంగారు దుర్గారావు ఆమెకు మాయమాటలు చెప్పి బైక్‌పై ఎక్కించుకుని స్థానిక వీఎల్‌పురంలోని ఒక రేకుల షెడ్‌లోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో  చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. 
Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
