ఆటో డ్రైవర్లుగా పని చేస్తున్న ఇద్దరు వ్యక్తులు దురాగతానికి ఒడిగట్టారు.
పోలీసుల కథనం ప్రకారం.. రాజమండ్రిలోని ఒక వస్త్ర దుకాణంలో పని చేసే యువతి ఇంటికి ఆటోలో బయలు దేరింది. ఆటోలో వెళుతున్న ఆమెను తానేటి సుధాకరబాబు, తానేటి రామచంద్రప్రసాద్ అనే ఇద్దరు ఆటో డ్రైవర్లు ఆమెపై కన్నేశారు. ఆటోలో వెళుతున్న ఆమెను కిడ్నాప్ చేసి ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు. విషయం బయటపడకుండా రాజీ ప్రయత్నాలూ చేశారు. అయితే బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఆటో డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై నిర్భయ కేసు నమోదు చేశారు.