మోత్కూరు గ్రామానికి చెందిన ఓ మహిళ పది రోజులుగా కనిపించడం లేదు.
మహిళ అదృశ్యం
Oct 4 2016 12:37 AM | Updated on Aug 21 2018 5:54 PM
వెలుగోడు: మోత్కూరు గ్రామానికి చెందిన ఓ మహిళ పది రోజులుగా కనిపించడం లేదు. గ్రామానికి చెందిన వెంకటసుబ్బారెడ్డి భార్య అచ్చమ్మ(55) గత నెల 23న ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అయితే వారం రోజులైనా తిరిగి రాకపోవడంతో ఆమె భర్త వెలుగోడు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ బాషా సోమవారం విలేకరులకు తెలిపారు. ఎవరికైన ఆచూకీ తెలిస్తే సెల్: 9581014525, 9441501734 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.
Advertisement
Advertisement