కారు ఢీకొని మహిళ మృతి | woman killed in road accident | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని మహిళ మృతి

Dec 12 2016 3:56 AM | Updated on Aug 30 2018 4:07 PM

అతివేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన నడుస్తున్న ఇద్దరిని ఢీకొట్టడంతో ఒకరు అక్కడిక్కడే మృతి

 దురాజ్‌పల్లి(చివ్వెంల) : అతివేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన నడుస్తున్న ఇద్దరిని ఢీకొట్టడంతో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన దురాజ్‌పల్లి గ్రామ శివారులో హైదరాబాద్- విజయవాడ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని జి.తిర్మలగిరి ఆవాసం గుంపుల గ్రామానికి చెందిన పచ్చిపాల రాములమ్మ (50), నకిరేకంటి లక్ష్మయ్యలు హరితహరం కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలకు గార్డులు ఏర్పాటు చేస్తున్నారు.
 
 ఈ క్రమంలో రహదారి పక్కన నిలబడి ఉండగా విజయవాడ నుంచి హైదరాబాద్ వై పు అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాములమ్మ అక్కడికక్కడే మృతిచెందగా, లక్ష్మయ్యకు కాళ్లు, చేతులకు తీవ్రగాయాలయ్యారుు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని డీఎస్పీ సునీతామోహన్, ఎస్‌ఐ బి.ప్రవీణ్‌కుమార్‌లు పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహన్ని పోస్టుమార్ట నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement