వనజాక్షికి అండగా ఉంటా: హరికృష్ణ | Sakshi
Sakshi News home page

వనజాక్షికి అండగా ఉంటా: హరికృష్ణ

Published Tue, Aug 4 2015 11:41 AM

వనజాక్షికి అండగా ఉంటా: హరికృష్ణ - Sakshi

హైదరాబాద్ : కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షికి టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణ మద్దతుగా నిలిచారు.  ఆమెను వచ్చిన బెదిరింపు లేఖను ఆయన మంగళవారమిక్కడ తీవ్రంగా ఖండించారు.  వనజాక్షి పోరాటానికి  అండగా ఉంటామని, ఆమెను చంపుతామని బెదిరింపు లేఖ రాసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని హరికృష్ణ డిమాండ్ చేశారు.

ఇంతకాలం పార్టీలో మౌనంగా ఉన్న హరికృష్ణ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా మహిళలకు రక్షణ కల్పించడంలో తెలుగుదేశం ప్రభుత్వ విఫలమవుతోందనే అభిప్రాయాన్ని తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రెండు కేసులు వనజాక్షి, రిషితేశ్వరి కేసుల గురించి హరికృష్ణ తన సన్నిహితుల వద్ద ప్రస్తవించినట్లు ప్రచారం జరుగుతోంది.

నిజాయితీగా పని చేసిన ముసునురు ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసిన ఎమ్మెల్యేలకు అండగా నిలవడంపై హరికృష్ణ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆమెకు రక్షణ నిలవాల్సిన ప్రభుత్వం అమెను దోషిగా నిలబెడ్డమేంటని ప్రశ్నించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వనజాక్షి కుంటంబాన్ని చంపుతామని బెదిరింపు లేకలు వారిసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని హరికృష్ణ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

అలాగే  నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మృతికి కారణమైన వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని  హరికృష్ణ డిమాండ్ చేశారు. వారు ఎంతటి వారైనా సరే వదిలి పెట్టకూడదని ఆయన కోరారు.  సీనియర్ల ర్యాగింగ్ చేయటంతో మనస్తాపం చెంది రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

కాగా తాను ముసునూరు వదిలి వెళ్లే ప్రసక్తే లేదని ఎమ్మార్వో వనజాక్షి స్పష్టం చేశారు. బెదిరింపులకు తాను లొంగనని, ఉద్యోగుల ప్రాణాలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఆమె అన్నారు. తన కుటుంబానికి హాని ఉన్నందున భద్రత కల్పించాలని వనజాక్షి ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement
Advertisement