బాపూజీనగర్ క్రాస్‌రోడ్డులో ఉన్న రైల్వే ఫ్లైఓవర్ పక్కన మంగళవారం గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించినట్లు కాజీపేట సీఐ రమేష్‌కుమార్ తెలిపారు.
బాపూజీనగర్ బ్రిడ్జి సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
Oct 5 2016 12:29 AM | Updated on Aug 25 2018 4:51 PM
కాజీపేట : బాపూజీనగర్ క్రాస్‌రోడ్డులో ఉన్న రైల్వే ఫ్లైఓవర్ పక్కన మంగళవారం గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించినట్లు కాజీపేట సీఐ రమేష్‌కుమార్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. ప్లైఓవర్ పక్క నుంచి రైల్వేలైన్ దాటుతున్న స్థానికులు యువకుడి శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. మొదట ఎవరో రోడ్డు పక్కన పడిపోయి ఉంటారనే ఉద్దేశంతో దగ్గరకు వెళ్లిచూడగా చనిపోయి ఉన్నాడు. మృతుడి వయస్సు 40 ఏళ్లు ఉండొచ్చని, చామనఛాయ రంగులో ఉండి ఎర్రని టీషర్ట్ వేసుకున్నట్లు చెప్పారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపర్చినట్లు చెప్పారు. మృతుడి వివరాలు తెలిసిన వారేవరైనా 94407-00506 నంబర్‌కు ఫోన్ చేయాలని సీఐ కోరారు.
Advertisement
Advertisement