ఇద్దరు దొంగల అరెస్టు
పెద్దాపురం : రావుల పాలెం, గంగవరం ప్రాంతాల్లో పలు చోరీలకు పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు రూ. ఆరు లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు పెద్దాపురం సీఐ శ్రీధర్‌కుమార్ తెలిపారు. ఆయన బుధవారం విలేకరులకు ఆ వివరాలను తెలిపారు. దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామానికి చెందిన మేకా దుర్గా ప్రసాద్, విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన ఎల్లో మహంతి రమేష్ స్థానిక ఏడీబీ రోడ్డు
రూ.6 లక్షల బంగారు ఆభరణాల స్వాధీనం
పెద్దాపురం : రావుల పాలెం, గంగవరం ప్రాంతాల్లో పలు చోరీలకు పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు రూ. ఆరు లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు పెద్దాపురం సీఐ శ్రీధర్‌కుమార్ తెలిపారు. ఆయన బుధవారం విలేకరులకు ఆ వివరాలను తెలిపారు. దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామానికి చెందిన మేకా దుర్గా ప్రసాద్, విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన ఎల్లో మహంతి రమేష్ స్థానిక ఏడీబీ రోడ్డులోని రుచి ప్యాక్టరీ వద్ద అనుమానాస్పదంగా తిరగడంతో అదుపులోకి తీసుకున్నామన్నారు. దుర్గాప్రసాద్ కొండపల్లి గ్రామంలో ఓ ఇంట్లో చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అతని వాంగ్మూలం మేరకు గంగవరం, రావులపాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలో చేసిన దొంగతనాల్లో చోరీ ఆస్తిని నర్సీపట్నంలో ఉంటున్న రమేష్ వద్ద స్వాధీనం చేసుకున్నట్టు సీఐ శ్రీధర్‌కుమార్ తెలిపారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాల విలువ సుమారు రూ. ఆరు లక్షలు ఉంటుందన్నారు. వీరిద్దరినీ రిమాండ్ కోసం పెద్దాపురం కోర్టుకు తరలిస్తామన్నారు. ఈ కేసును ఛేదించిన ఎస్సై వై.సతీష్, సీసీఎస్ ఎస్సై ఎస్‌జీ వలీ, ఏఎస్సై బి.నరసింహారావు, హెచ్‌సీలు బలరాంమూర్తి, రంగబాబు, వై.కృష్ణ, వి.నాగభూషణం, పీసీలు బి.రాధాకృష్ణ, ఎం.రాకేష్, డి.సాయికృష్ణలను ఆయన అభినందించారు.