రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు | Two persons injured in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

Jul 26 2016 1:40 AM | Updated on Aug 30 2018 4:07 PM

నార్కట్‌పల్లి రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి.

 నార్కట్‌పల్లి
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన  మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆర్చీ సమీపంలో సోమవారం  చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల నుంచి పార్సల్‌ లోడుతో  టాటాఏస్‌ వాహనం నార్కట్‌పల్లి వైపు వస్తోంది. ఇదే సమయంలో కంటైనర్‌ వేణుగోపాల స్వామి ఆర్చీ సమీపంలో రాంగ్‌రూట్‌లో వచ్చి రోడ్డు క్రాస్‌ చేస్తుండగా ఎదురుగా వచ్చిన టాటాఏస్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాటాఏస్‌లో ప్రయాణిస్తున్న కనగల్‌ గ్రామానికి చెందిన కోమాగోని రమేష్, కంచనపల్లి గ్రామానికి మర్రి వినోద్‌కు తీవ్రగాయలయ్యాయి. వారిని  చికిత్స నిమితం స్థానికి కామినేని అస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ మోతీరామ్‌ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement