పిడుగుపాటుకి ఓ వలస కూలీ మృతి చెందింది. ఈ ఘటన అనంతపురం జిల్లా డీహీరేహళ్ మండలంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది.
డీహీరేహళ్(అనంతపురం): పిడుగుపాటుకి ఓ వలస కూలీ మృతి చెందింది. ఈ ఘటన అనంతపురం జిల్లా డీహీరేహళ్ మండలంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని కాదలూరు గ్రామానికి చెందిన పార్వతి(40), జీవనాధరం కోసం బళ్లారి జిల్లా సిద్ధపల్లికి వలస వెళ్లింది. అక్కడ వ్యవసాయ కూలీగా పొలంలో పనిచేస్తుండగా ఈ రోజు పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందింది.