ఎండవేడిమితో వడదెబ్బకు గురై జిల్లాలో మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు.
వడదెబ్బతో ఇద్దరు మృతి
Apr 17 2017 10:37 PM | Updated on Sep 28 2018 3:41 PM
కోడుమూరు రూరల్: ఎండవేడిమితో వడదెబ్బకు గురై జిల్లాలో మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. కోడుమూరు మండలం వర్కూరు గ్రామానికి చెందిన కుర్నూరు రాముడు (66) శనివారం ఉపాధి పనులకు వెళ్లాడు. అక్కడ తీవ్రమైన ఎండను తట్టుకోలేక అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు అదేరోజు సాయంత్రం కోడుమూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక సోమవారం తెలవారుజామున మృతి చెందాడు. మృతుడికి భార్య చెన్నమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు.
గని కార్మికుడు మృతి
గడివేములకు చెందిన గని కార్మికుడు ఎస్. వెంకటేశ్వర్లు (40) సోమవారం ఉదయం గనికి వెళ్లాడు. మధ్యాహ్నం పని ముగించుకుని ఇంటికి వస్తుండగా ఎండ వేడిమితో అస్వస్థతకు గురై మార్గమధ్యంలో సొమ్మసిల్లి పడిపోయాడు. చికిత్స నిమిత్తం ఆర్‌ఎంపీకి వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నాడు.
Advertisement
Advertisement