వన్‌టౌన్ స్టేషన్ పరిధిలో వేర్వేరు చోట్ల రెండు ద్విచక్రవాహనాలు చోరీ అయ్యాయి.
అనంతపురం సెంట్రల్ : వన్‌టౌన్ స్టేషన్ పరిధిలో వేర్వేరు చోట్ల రెండు ద్విచక్రవాహనాలు చోరీ అయ్యాయి. రూరల్ మండలం పాపంపేటకు చెందిన వెంకటరాముడు పాతూరులోని బ్రహ్మంగారి గుడి దగ్గర ద్విచక్రవాహనం నిలిపి సొంతపనిపై పక్కకు వెళ్లారు. వచ్చే చూసే సరికి ద్విచక్రవాహనం మాయమైంది.
అలాగే సాయినగర్‌లోని వరుణ్ హాస్పిటల్ వద్ద బుక్కరాయసముద్రం మండలం కొండాపురానికి చెందిన నాగరాజు ద్విచక్రవాహనాన్ని దొంగలించారు. ఈ రెండు ఘటనలపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.