బాలిక ఆత్మహత్య కేసులో ఇద్దరి అరెస్ట్‌ | Two arrested in girl suicide case | Sakshi
Sakshi News home page

బాలిక ఆత్మహత్య కేసులో ఇద్దరి అరెస్ట్‌

Jul 18 2017 6:02 AM | Updated on Aug 25 2018 5:33 PM

బాలిక ఆత్మహత్య కేసులో ఇద్దరి అరెస్ట్‌ - Sakshi

బాలిక ఆత్మహత్య కేసులో ఇద్దరి అరెస్ట్‌

ఓ బాలిక ఆత్మహత్యకు కారణమైన ఇరువురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన సోమవారం మోత్కూరులో చోటు చేసుకుంది.

నిందితులపై నిర్భయ కేసు నమోదు
మోత్కూరు (తుంగతుర్తి) : ఓ బాలిక ఆత్మహత్యకు కారణమైన ఇరువురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన సోమవారం మోత్కూరులో చోటు చేసుకుంది. సోమవారం మోత్కూరు పోలీస్‌స్టేషన్‌లో చౌటుప్పల్‌ ఏసీపీ ఎం.స్నేహిత, రామన్నపేట సీఐ ఎన్‌.శ్రీనివాస్‌తో కలిసి యాదాద్రిభువనగిరి జిల్లా డీసీపీ పాలకుర్తి యాదగిరి వివరాలను వెల్లడించారు.

మోత్కూరు మండలంలోని దత్తప్పగూడెం గ్రామానికి చెందిన బాలిక (14)తో సమీపంలోని పాలడుగు గ్రామానికి చెందిన కందికట్ల శ్రీహరికి వేసవికాలంలో పశువులు మేపే క్రమంలో స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ విషయం గ్రామంలో పలువురికి తెలుసు. బాలికకు శ్రీహరి తరచూ ఫోన్, మెసేజ్‌లు చేయగా బాలిక స్పందించలేదు. పశువులు మేపే సమయంలో శ్రీహరి అక్కడికి చేరుకుని బాలికపై చేయిచేసుకున్నాడు. సమీపంలో ఉన్న దత్తప్పగూడెం గ్రామానికి చెందిన ఎలుగు శ్రీను వారి వద్దకు చేరుకుని ఈ విషయాన్ని ఎక్కడా చెప్పవద్దని ఇరువురిని సముదాయించాడు. ఇంటికి చేరుకున్న సదరు బాలిక అవమానాన్ని భరించలేక ఇంట్లో ఎవరూలేని సమయంలో స్లాబ్‌ ఉక్కుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఇలా వెలుగులోకి..
బాలిక ఆత్మహత్యపై ఇటీవల దత్తప్పగూడెం బాలిక కుటుంబంతో.. మరొక రికి ఘర్షణ జరిగింది. ఈ విషయంలో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నా రు. కేసు విచారణ జరుపుతున్న సమయంలో బాలిక ఆత్మహత్య వెలుగులో కి వచ్చింది. దీంతో ఆ కేసును విచారించగా.. బాలిక ఆత్మహ త్యకు కందికట్ల శ్రీహరి, ఎలుగు శ్రీను కారణమని గుర్తించి వారిని అరెస్ట్‌ చేశారు. నిందితులపై 324, 305, 354 ఏ, డీ, రెడ్‌విత్త్‌ 34 ఐపీసీ సెక్షన్లతోపాటు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో స్థానిక ఎస్‌ఐ ఎం.సత్యనారాయణ ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement