అదనపు కట్నం తేవాలని భార్యను వేధింపులకు గురిచేస్తున్న భర్త ఇబ్రహీంబాషా, మామ సాహెబ్ ఖాదర్‌లను అరెస్ట్ చేసినట్లు ఆత్మకూరు సీఐ కృష్ణయ్య, ఎస్‌ఐ శివశంకర్‌నాయక్ వెల్లడించారు.
అదనపు కట్నం కేసులో ఇద్దరు అరెస్ట్
May 28 2017 11:50 PM | Updated on Aug 20 2018 4:30 PM
కొత్తపల్లి: అదనపు కట్నం తేవాలని భార్యను వేధింపులకు గురిచేస్తున్న భర్త ఇబ్రహీంబాషా, మామ సాహెబ్ ఖాదర్‌లను అరెస్ట్ చేసినట్లు ఆత్మకూరు సీఐ కృష్ణయ్య, ఎస్‌ఐ శివశంకర్‌నాయక్ వెల్లడించారు. నందికొట్కూరు పట్టణానికి చెందిన ఇబ్రహీం బాషా కొత్తపల్లి మండలం శివపురం గ్రామానికి చెందిన మునీరాబీని రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అయితే మళ్లీ కట్నం తేవాలని భర్త కుటుంబీకులు నిత్యం వేధింపులకు గురి చేయడంతో బాధితురాలు కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేసింది. ఈమేరకు అత్త బీబీఖాద్రీ, ఆడపడుచులు షంషీద్‌బీ, రేష్మాలతో పాటు భర్త, మామలపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం భర్తను, మామను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చినట్లు సీఐ వెల్లడించారు.
Advertisement
Advertisement