టీఆర్‌ఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడికి సన్మానం | trs district viceprecident is appreciated | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడికి సన్మానం

Aug 1 2016 10:12 PM | Updated on Sep 4 2017 7:22 AM

మండలంలోని కడ్తాల్‌ అయ్యప్ప ఆలయంలో సోమవారం టీఆర్‌ఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎంపికైన పాకాల రాంచందర్‌ దంపతులను గురుస్వామి నర్సారెడ్డి ఘనంగా సన్మానించారు.

నిర్మల్‌టౌన్‌ : మండలంలోని కడ్తాల్‌ అయ్యప్ప ఆలయంలో సోమవారం టీఆర్‌ఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎంపికైన పాకాల రాంచందర్‌ దంపతులను గురుస్వామి నర్సారెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంత్రులు జోగు రామన్న, ఐకేరెడ్డి, జెడ్పీ చైర్మన్‌ శోభారాణి, ఎంపీ నగేష్, పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డిలు తనపై నమ్మకం ఉంచి తనకు బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. 
 
 
 
 

 

Advertisement
 
Advertisement
Advertisement