రాజధాని ప్రాంతంలోని రాయపూడి– లింగాయపాలెం గ్రామాల మధ్య శుక్రవారం జరగనున్న ప్రభుత్వ కార్యాలయ..
- విజయవాడ నుంచి వచ్చే వీఐపీల వాహనాలు మొదటి రూట్‌లో కరకట్ట మీదుగా ఉద్దండరాయునిపాలెం బొడ్రాయి అక్కడ నుంచి లింగాయపాలెం నుంచి వీఐపీ పార్కింగ్‌కు వెళ్లాలని సూచించారు. రెండో రూట్‌లో కరకట్ట మీదుగా వెంకటపాలెం– మందడం– వెలగపూడి– ఉద్దండరాయునిపాలెం బొడ్డురాయి– లింగాయపాలెం– వీఐపీ పార్కింగ్‌కు చేరుకోవాలని చెప్పారు.
- గుంటూరు నుంచి వచ్చే వీఐపీ వాహనాలు తాడికొండ మీదుగా తుళ్లూరు– రాయపూడి నుంచి కరకట్ట వైపు వచ్చి లింగాయపాలెం వెనుకవైపు ఉన్న వీఐపీ పార్కింగ్‌కు చేరుకోవాలి.
- విజయవాడ వైపు నుంచి సామాన్య ప్రజలు ఉండవల్లి సెంటర్ నుంచి పెనుమాక– కృష్ణాయపాలెం– వెలగపూడి– రాయపూడి నర్సరీ– లింగాయపాలెం ఎన్‌సీసీ కాంక్రీట్ లిక్కర్ పార్కింగ్ ప్లేస్‌లో ఆర్టీసీ, సిటీ బస్సులకు పార్కింగ్ ఉంది. దాని వెనుక కార్లు, ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేశారు. మంగళగిరి నుంచి వచ్చే వాహనాలు ఎర్రబాలెం– కృష్ణాయపాలెం– వెలగపూడి– రాయపూడి నర్సరీ– లింగయపాలెం ఎన్‌సీసీ కాంక్రీట్ లిక్కర్ పార్క్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు.
- గుంటూరు నుంచి వచ్చే సాధారణ వాహనాలు తాడికొండ మీదుగా తుళ్లూరు– రాయపూడి నర్సరీ– లింగాయపాలెం ఎన్‌సీసీ కాంక్రీట్ లిక్కర్ పార్క్ వద్ద పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. వీఐపీలు, ప్రజలు ట్రాఫిక్ మళ్ళింపులను గుర్తించి పోలీసులకు సహకరించాలని నాయక్ కోరారు.