సమస్యలు పరిష్కరించాలి | To solve the problems | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాలి

Aug 6 2016 6:57 PM | Updated on Sep 4 2017 8:09 AM

సమస్యలు పరిష్కరించాలి

సమస్యలు పరిష్కరించాలి

చివ్వెంల : స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ కల్పగిరి యశోద అధ్యక్షతన జరిగిన సర్వసభ్వ సమావేశంలో గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై అధికారులను ప్రజాప్రతినిధులు నిలదీశారు.

చివ్వెంల : స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ కల్పగిరి యశోద అధ్యక్షతన జరిగిన సర్వసభ్వ సమావేశంలో గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై అధికారులను ప్రజాప్రతినిధులు నిలదీశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌నాయక్‌తండా, పాండ్యానాయక్‌తండా, బి.చందుపట్ల గ్రామాల సర్పంచ్‌లు గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని నూతన బోర్లు మంజూరు చే యాలని  సభకు దృష్టికి తీసుకు రాగా స్పందించిన ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ సమస్యపై దృష్టిసారించి పరిష్కరిస్తామన్నారు. అదేవిధంగా మండలంలో మలేరియా, డెంగీ వ్యాధులపై గ్రామాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించాలని కుడకుడ గ్రామ ఎంపీటీసీ రత్నావత్‌ నాగరాజు కోరగా వైద్యాధికారి స్పందించి ఏఎన్‌ఎంలతో సమావేశం నిర్వహించి ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. రోళ్లబండ తండా, వట్టిఖమ్మంపహాడ్‌ గ్రామాల్లోని పాఠశాలలకు ప్రహరీలు నిర్మించాలని సర్పంచ్‌ అనంతుల వెంకటమ్మ, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు పబ్బుసైదులు గౌడ్‌లు కోరారు. దీంతో ఎంఈఓ మాట్లాడుతూ జిల్లా అధికారులకు ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. మండల కేంద్ర శివారులోని ఊర చెరువు వరద కాలువను పూడ్చి వేసి కొంతమంది రియల్‌ వ్యాపారులు వెంచర్లు చేస్తున్నారని మండల కోఆప్షన్‌ సభ్యుడు షేక్‌ లాల్‌మహ్మద్‌ సభ దృష్టికి తీసకురాగా సంబందిత వ్యాపారులకు నోటీసులు జారీచేస్తామని ఈఓఆర్డీ పేర్కొన్నారు. ఇంకా పలువురు సభ్యులు పలు సమస్యలను సభలో ప్రస్తావించగా వాటి పరిష్కారానికి కృషిచేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ సభలో జెడ్పీటీసీ సభ్యురాలు రౌతు చొక్కమ్మ, ఎంపీడీఓ జె.వెంకటేశ్వర్‌రావు, జిల్లా కోఆప్షన్‌ సభ్యుడు షేక్‌ భాషా, పశు వైద్యాధాకారి శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్‌ అసిస్టెంట్‌ పుష్ప, ఎఈలు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement