నగల కోసం వృద్ధురాలిని చంపిన దొంగలు | thieves killed Old woman for jewelry | Sakshi
Sakshi News home page

నగల కోసం వృద్ధురాలిని చంపిన దొంగలు

May 26 2016 8:23 AM | Updated on Aug 28 2018 7:30 PM

ఆభరణాల కోసం ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధురాలిని దుండగులు చంపేశారు.

ఆభరణాల కోసం ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధురాలిని దుండగులు చంపేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొమ్మరవేని రాయమల్లమ్మ(65) కొన్నేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయి, ఒంటరిగా ఉంటోంది. బుధవారం రాత్రి తన ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఆమెను గుర్తు తెలియని దుండగులు గొంతునులిమి చంపారు. ఆమె ఒంటిపైని ఆభరణాలను ఎత్తుకుపోయారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చోరీ సొత్తు వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement