నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిశాయి.
నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. హుజూర్‌నగర్ నియోజకవర్గం పరిధిలో పలు చోట్ల మోస్తరు వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. మేళ్లచెర్వు మండలం ఎర్రగట్టు తండాలో పిడిగుపాటుకు రెండు ఆవులు మృతి చెందాయి.