పోషించే స్తోమత లేక ఓ తల్లి తన కన్న కూతురిని అచ్చంపేటలోని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించింది.
పోషించే స్తోమత లేక ఓ తల్లి తన కన్న కూతురిని అచ్చంపేటలోని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించింది. ఈ సంఘటన అచ్చంపేట మండలం అక్కారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భారతి, వశ్యా దంపతులకు మొదటి, రెండు కాన్పుల్లో ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారు. మూడవ కాన్పులో కూడా ఆడపిల్లే పుట్టడంతో తమకు భారమై పోతుందని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. స్థానిక ఐసీడీఎస్ అధికారులు శిశువును మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని శిశువిహార్‌కు తరలించారు.