తూర్పుగోదావ రి జిల్లా రావులపాలెంలో భారీ చోరీ జరిగింది.
- 3కిలోల వెండి, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు
రావులపాలెం(తూర్పుగోదావరి జిల్లా)
తూర్పుగోదావ రి జిల్లా రావులపాలెం గ్రామం వేణుగోపాలస్వామి ఆలయం వీధిలోని ఒక ఇంట్లో మంగళవారం వేకువజామున చోరీ జరిగింది. వైద్యఆరోగ్యశాఖలో ఎంపీహెచ్‌ఓగా పనిచేస్తున్న కొత్తగుంట శ్రీరామచంద్రమూర్తికి ఇటీవల జరిగిన ప్రమాదంలో కాలు ఫ్రాక్చరైంది. దాంతో అమలాపురం సమీపంలోని కోటుపల్లెలోని అత్తగారింట్లో ఉంటున్నాడు. ఈ నేపధ్యంలో ఇంటికి తాళం వేసిఉండటాన్ని గమనించిన దొంగలు మంగళవారం వేకువజామున తలుపులు పగులగొట్టి బీరువాలోని 3 కిలోల వెండి వస్తువులు, ఆరు కాసుల బంగారు నగలు , ఎల్‌ఈడీ టీవీ దోచుకెళ్లారు. తలుపులు తెరిచిఉండటాన్ని గమనించిన ఇరుగుపొరుగువారు శ్రీరామచంద్రమూర్తికి సమాచారం ఇవ్వడంతో అతను వచ్చి జరిగిన చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశాదు. కాకినాడ నుంచి క్లూస్ టీమ్‌ను రప్పించారు.