రైతు సంక్షేమమే ధ్యేయం | The goal is for the welfare of the farmer | Sakshi
Sakshi News home page

రైతు సంక్షేమమే ధ్యేయం

Feb 10 2017 10:52 PM | Updated on Sep 5 2017 3:23 AM

రైతు సంక్షేమమే ధ్యేయం

రైతు సంక్షేమమే ధ్యేయం

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నిర్మల్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్ కె.దేవేందర్‌రెడ్డి అన్నారు.

మార్కెట్‌ కమిటీ చైర్మన్ కె.దేవేందర్‌రెడ్డి
దిలావర్‌పూర్‌ :  రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నిర్మల్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్  కె.దేవేందర్‌రెడ్డి అన్నారు. దిలావర్‌పూర్‌లో రూ.3కోట్ల వ్యయంతో నిర్మించిన గోదాం పనులు పూర్తికావడంతో గురువారం జిల్లా మార్కెటింగ్‌ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కృషి ఫలితంగా నిర్మల్‌ జిల్లా రైతులకు ఎంతగానో మేలు చేకూర్చేవిధంగా అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. రైతులకు వ్యవసాయానికి సంబంధించి విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా ఇప్పటికే   దిలావర్‌పూర్, సిర్గాపూర్, గుండంపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద విద్యుత్‌ సబ్‌స్టేన్ లు ఉండగా మరో నూతన గుండంపల్లి విద్యుత్‌ సబ్‌స్టేన్  ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు.

ఇందులో జిల్లా మార్కెటింగ్‌ అధికారి టి.శ్రీనివాస్, ఓఎస్‌వో ఆర్‌.సుధాకర్, మార్కెట్‌ కమిటీ సెక్రెటరి సత్యనారాయణ, సూపరింటెండెంట్‌ భాస్కర్, స్థానిక సర్పంచ్‌ నంద అనిల్, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ ధనె నర్సయ్య, నాయకులు ధనె రవి, ముత్యంరెడ్డి, కోడెనవీన్, సప్పల రవి, ముథోల్‌ నరేందర్, ఉమాశంకర్, గుణవంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement