అప్పులబాధతో రైతు ఆత్మహత్య | The farmer committed suicide | Sakshi
Sakshi News home page

అప్పులబాధతో రైతు ఆత్మహత్య

Jul 29 2016 7:21 PM | Updated on Oct 1 2018 2:36 PM

భీంగల్ మండలం దేవక్కపేట్‌లో కుప్ప లక్ష్మీరాజం(45) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

భీంగల్ మండలం దేవక్కపేట్‌లో కుప్ప లక్ష్మీరాజం(45) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం రాత్రి పొలంలో ఓ చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. చెట్టుకు ఉరివేసుకుని ఉండటం గ్రామస్తులు శుక్రవారం గమనించి కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. అప్పుల బాధ భరించలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇటీవలే కూతురు పెళ్లి చేయడంతో సుమారు రూ.5 లక్షల అప్పు అయ్యిందని పేర్కొన్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement