ముగిసిన జిల్లా స్థాయి యోగా పోటీలు | The end of the district-level yoga competition | Sakshi
Sakshi News home page

ముగిసిన జిల్లా స్థాయి యోగా పోటీలు

Aug 22 2016 12:35 AM | Updated on Sep 4 2017 10:16 AM

ముగిసిన జిల్లా స్థాయి యోగా పోటీలు

ముగిసిన జిల్లా స్థాయి యోగా పోటీలు

వరంగల్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) యోగా హాల్‌ లో జిల్లా యోగా సంఘం ఆధ్వర్యంలో శని వారం ప్రారంభమైన జిల్లా స్థాయి యోగా పోటీలు ఆదివారం ముగిశాయి.

కాజీపేట రూరల్‌ : వరంగల్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) యోగా హాల్‌ లో జిల్లా యోగా సంఘం ఆధ్వర్యంలో శని వారం ప్రారంభమైన జిల్లా స్థాయి యోగా పోటీలు ఆదివారం ముగిశాయి. నిట్‌ ఫ్రొఫెసర్‌ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ము గింపు కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్‌ సం ధ్యారాణి మాట్లాడుతూ యోగాతో సంపూర్ణ మానసిక శారీరక ఆరోగ్యం లభిస్తుందని అన్నారు. అనంతరం యోగా పోటీల్లో గెలుపొందిన  విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. జిల్లాస్థాయిలో   విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు సెప్టెంబర్‌ 8, 9, 10 తేదిల్లో అదిలాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో యోగా అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముప్ప మల్లేషం, బి.కమల్‌కుమార్, కోశాధికారి పాకాల రవిందర్, యోగా సంఘం కమిటి సభ్యులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement