పాము కాటుతో చిన్నారి మృతి | The child died of snake bite | Sakshi
Sakshi News home page

పాము కాటుతో చిన్నారి మృతి

May 15 2016 5:20 PM | Updated on Sep 28 2018 3:41 PM

చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం పందిళ్లపల్లి పంచాయతీ ముదురెడ్డిపల్లి గ్రామానికి చెందిన టి.అరుణ(4) అనే చిన్నారి ఆదివారం ఉదయం పాము కాటుతో మృతిచెందింది.

చౌడేపల్లి :  చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం పందిళ్లపల్లి పంచాయతీ ముదురెడ్డిపల్లి గ్రామానికి చెందిన టి.అరుణ(4) అనే చిన్నారి ఆదివారం ఉదయం పాము కాటుతో మృతిచెందింది. తల్లిదండ్రులు వెంకటరమణ, నిర్మలతో కలిసి ఇంటి ముందర నిద్రిస్తుండగా ఆదివారం తెల్లవారుజామున కట్లపాము కాటేసింది. పాప కేకలు వేయడంతో గమనించిన కుటుంబసభ్యులు పామును చంపేశారు. చిన్నారిని చౌడేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో పుంగనూరుకు తీసుకెళ్లమనిచెప్పడంతో తీసుకెళుతుండగా మార్గమధ్యంలో పాప మృతిచెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement