ఇంటి బయట ఆడుకుంటున్న ఆరేళ్ల బాలుడు విద్యుత్ స్తంభాల కోసం తీసిన గోతిలో పడి ప్రాణాలు కోల్పోయాడు.
ఇంటి బయట ఆడుకుంటున్న ఆరేళ్ల బాలుడు విద్యుత్ స్తంభాల కోసం తీసిన గోతిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం గొల్లపాలెం గ్రామంలో ఇది జరిగింది. ఎం.హరి, కావమ్మల కుమారుడు అభిషేక్ (6) ఒకటో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం ఇంటి దగ్గర ఆడుకుంటూ అదృశమయ్యాడు. ఆ రాత్రి చుట్టుపక్కల వెతికినా చిన్నారి ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం తిరిగి అతడి కోసం తల్లిదండ్రులు గాలించారు. ఇంటి దగ్గర్లో విద్యుత్‌స్తంభం ఏర్పాటుకు తీసిన గోయిలో అతడు విగత జీవిగా పడి ఉండగా గుర్తించారు.