ఇ–బైక్‌లకు సాంకేతిక పరీక్షలు
భీమవరం : భీమవరం శ్రీ విష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి విష్ణు ఇ–మోటో చాంపియన్‌షిప్ పోటీల్లో రెండో రోజు శనివారం విద్యార్థులు తయారు చేసిన వివిధ మోటార్ సైకిళ్ల సాంకేతికత, బరువు, నీటి పరీక్షలను నిర్వహించారు.
భీమవరం : భీమవరం శ్రీ విష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి విష్ణు ఇ–మోటో చాంపియన్‌షిప్ పోటీల్లో రెండో రోజు శనివారం విద్యార్థులు తయారు చేసిన వివిధ మోటార్ సైకిళ్ల సాంకేతికత, బరువు, నీటి పరీక్షలను నిర్వహించారు. జాతీయస్థాయిలో ఆరు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన 25 విద్యార్థి బందాలు ఎలక్ట్రికల్ ఈ బైక్‌లను తయారు చేసి ప్రదర్శనలో ఉంచాయి. వాటికి సాంకేతిక పరీక్షలు నిర్వహించి వాహనం తయారీ నియమావళి ప్రకారం రూపొందించారో లేదో పరీక్షించారు. ప్రతి బైక్ బరువును పరీక్షించి నీటి పరీక్షలను కూడా చేపట్టారు.
వానాకాలంలో ఈ బైక్‌లు తడవడం వల్ల సంభవించే లోపాలు, షార్ట్ సర్క్యూట్ ప్రమాదమేదైనా ఉందా అనే అంశాలను పరీక్షించారు. ఈ పరీక్షలను తట్టుకుని నిలబడిన ఇ–నమూనా బైక్‌లకు తదనంతరం సాంకేతిక టెస్ట్ నిర్వహిస్తామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.శ్రీనివాసరావు చెప్పారు. సామాన్యులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేసే విధంగా విద్యార్థులు ఇ–బైక్‌లు రూపొందించారని ఆయన తెలిపారు. బయోమెట్రిక్ విధానంలో వాహన యజమాని చేతి వేలి ముద్రలు గుర్తించడం, వాహనం నడపడానికి తాళంతో పాటు మొబైల్ ద్వారా వచ్చే పాస్‌వర్డ్ సందేశం, హెల్మెట్ యజమాని ధరించింది, లేనిదీ సూచించే నవీన సౌకర్యాలు వంటివి విద్యార్థుల సజనాత్మకతను సూచిస్తున్నాయని శ్రీనివాసరావు చెప్పారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాసరాజు, కార్యక్రమ కో ఆర్డినేటర్లు మనోనీత్ కుమార్, వికాస్, సాగర్, న్యాయ నిర్ణేతలు పాల్గొన్నారు.