సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ | technical knowledge training | Sakshi
Sakshi News home page

సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ

Oct 4 2016 8:10 PM | Updated on Sep 4 2017 4:09 PM

జిల్లాలోని డ్వాక్రా సంఘ సభ్యులకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించేవిధంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేలా ప్రత్యేక కార్యాచరణను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ రూపొందించింది. ఈ మేరకు ముందుగా సభ్యులకు శిక్షణనిచ్చేందుకు ప్రతి మండల పరిధిలోని ఆరుగురు సభ్యులను శిక్షకులుగా (ఇంటర్నెట్‌ సాతీ)ఎంపిక చేశారు. ఎంపిక చేసిన సాతీలకు ముందుగా శిక్షణ ఇచ్చేందుకు షెడ్యూల్‌ను రూపొందించారు.

కాకినాడ సిటీ : 
జిల్లాలోని డ్వాక్రా సంఘ సభ్యులకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించేవిధంగా శిక్షణ  కార్యక్రమాలు నిర్వహించేలా ప్రత్యేక కార్యాచరణను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ రూపొందించింది. ఈ మేరకు ముందుగా సభ్యులకు శిక్షణనిచ్చేందుకు ప్రతి మండల పరిధిలోని ఆరుగురు సభ్యులను శిక్షకులుగా (ఇంటర్నెట్‌ సాతీ)ఎంపిక చేశారు. ఎంపిక చేసిన సాతీలకు ముందుగా శిక్షణ ఇచ్చేందుకు షెడ్యూల్‌ను రూపొందించారు. 5,6 తేదీల్లో అమలాపురం టీటీడీసీలోనూ, 7న రాజమండ్రి ఎన్‌ఎంఎస్‌లోనూ, 13 నుంచి 18వ తేదీ వరకు సామర్లకోట టీటీడీసీలోనూ శిక్షణ ఇవ్వనున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన సాతీలు మూడు నెలల వ్యవధిలో క్షేత్రస్థాయిలో 3లక్షల 69వేల 600 సంఘ సభ్యులకు డిజిటల్‌ లిట్రసీపై శిక్షణ ఇస్తారని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ మల్లిబాబు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement