టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది.
విజయవాడ: టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. హైదరాబాద్లో ఉన్న ఏపీ సచివాలయాన్ని తెలంగాణకు అప్పగించడంపై శుక్రవారం చర్చించారు. ఆ ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పొలిట్ బ్యూరో ముందు ఉంచారు. తెలంగాణకు అప్పగించేందుకు మెజారిటీ సభ్యులు అంగీకారం తెలిపారు. కాగా, ఢిల్లీలోని ఏపీ భవన్ తరహాలో హైదరాబాద్లో ఏపీకి ఓ భవనాన్ని కేటాయించేలా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించారు.
అంతకు ముందు చంద్రబాబు నాయుడు గవర్నర్ నరసింహన్తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. హైదరాబాద్లో ఏపీ సచివాలయం అప్పగింతపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. గవర్నర్ భేటీలో హైదరాబాద్ లో ఏపీ సచివాలయం భవనాలను తెలంగాణ రాష్ట్రానికి అప్పగించేందుకు చంద్రబాబు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.